ఉప్పొంగి దూకింది ఊహల నర్తనం
మబ్బుల్నే మీటింది మదిలోని మహొత్సవం
హరివిల్లై విరిసింది ఆశల నందనం
మిణుకు మిణుకుమని తళుకులొళుకు తారలతో ఆకాశం
చినుకు చినుకులై కరిగి కరిగి దిగి వచ్చే నా కోసం ఓ..
దిక్కుల్నే దాటింది ఆనంద తాండవం
ఉప్పొంగి దూకింది ఊహల నర్తనం
నలుపొకటే కొలువున్న కనుపాపలో ఇలా
తొలిసారి ఈ వేళా ఎన్నెన్ని వర్ణాలో
నలుపొకటే కొలువున్నా కనుపాపలో ఇలా
తొలిసారి ఈ వేళా ఎన్నెన్ని వర్ణాలా
తన చెలిమి కొనవేలు అందించి ప్రియురాలు
నడిపింది తనవైపిలా
ఈ దివ్య లోకాలు ఈ నవ్య స్వప్నాలు
చూపింది నలువైపులా
ఎదురై పిలిచే అనురాగాల యద కోయిలా
బదులై పలికే మది వేగన్ని తెలిపేదెలా ఓ..
దిక్కుల్నే దాటింది ఆనంద తాండవం
ఉప్పొంగి దూకింది ఊహల నర్తనం
వడగాలే విడిదైన యద లోయలో ఇలా
పూతోట విరిసేలా పన్నీటి వర్షాలా
వడగాలే విడిదైన యద లోయలో ఇలా
పూతోట విరిసేలా పన్నీటి వర్షాలా
ఇకపైన ఏనాడు కడలి ఒడిలోకి
పడిపోకు అలిసే అలా
అని నన్ను ఆపింది ఆ నింగి జాబిల్లి
నా చేతికందింది ఇలా
వలపే విరిసే అనుబంధాల ఈ సంకెల
వరదై ఎగసే మధుభావాలు తెలిపేదెలా ఓ..
దిక్కుల్నే దాటింది ఆనంద తాండవం
ఉప్పొంగి దూకింది ఊహల నర్తనం
మబ్బుల్నే మీటింది మదిలోని మహొత్సవం
హరివిల్లై విరిసింది ఆశల నందనం
మిణుకు మిణుకుమని తళుకులొళుకు తారలతో ఆకాశం
చినుకు చినుకులై కరిగి కరిగి దిగి వచ్చే నా కోసం ఓ..








0 comments:
Post a Comment