
కటికవాళ్ల కధలుముగియ కంటికొసల అగ్నులెగయ
కండకండగ వొళ్లు నరక కసికసిగా గొంతుకొరక
మృత్యువొచ్చి కేకలిడగ ప్రళయనాదం జగతివినగ
చుక్కచుక్కగ నెత్తురోడ దిక్కులన్నీ నక్కిచూడ
చిత్రహింస చేయుచుండ శత్రువులేమాసిపోవగా
విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదేకాంచనా
హెయ్ మరణమ్రుదంగం ఐ నినుచీల్చవచ్చే కాంచనా
కసిగ కసిగ కసిగ నిన్ను కండించేసి పోగా
కాలరాచి నేడునీకధ ముగించేసి పోగా
హే వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చిందిరా
హోరుగాలిలాగ వచ్చెరా నిన్ను నరికిపోగులెట్ట వచ్చెరా
ఆడామగా కలిసివచ్చెరా నిన్ను మింగివేయటానికొచ్చెరా
రె రె రే....విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదేకాంచనా
హెయ్ మరణమ్రుదంగం ఐ నినుచీల్చవచ్చే కాంచనా
కపాలమాలలు అగ్గినికురియగ కన్నుల మంటలు సెగలు మెరియ
ఆకలివేలల వేటకువచ్చే లోకమదిరిపోగా చక్కని నక్కలు
చేతికిచిక్కగ రాకాసిమూకల పీకలుతొక్కగ కాలిక నాలుక
తెరుచుకువచ్చే కాలమాగిపోగా కొముల పాములు గోధుమ
తాచులు అందంగా మెరిసే నాగులు కట్ల పాము చుట్ల పాము
తెల్లంగా విరిసే నాగులు పడగ పాము మన్ను పాము
ధీటైనా నీటిపాము పుట్టల పాములు గుట్టల పాములు తోడై వచ్చిందే
హోరుగాలిలాగ వచ్చెరా నిన్ను నరికిపోగులెట్ట వచ్చెరా
ఆడామగా కలిసివచ్చెరా నిన్ను మింగివేయటానికొచ్చెరా
రె రె రే....ఉరుమిరిమీ గొంతునులిమీ ఉరుమిరిమీ గొంతునులిమీ కడతేరుస్తానే
కన్నుల నిప్పుల మంట మండుతోంది కాలుడి గజ్జల గంట మోగుతుంది
పగల పొగల సెగ రగిలేను మూడేకాలమ్ వచ్చిందీ
చుక్కలునేలకు రాలిపోయెవేలా దిక్కులు అన్నీ పేలిపోయేవేలా
సింగపు నడకల సింగారిరూపాల మృత్యువు వచ్చిందీ
మండే తన కళ్లు చూసి సూరీడే చిన్నబోగా
చెలరేగే వేగం చూసి సెలయేర్లే అదిరిపోగా
గొంతుకల్లే కోసి కోసి నెత్తుటేర్లే పాలిస్తుంది
లోకాలన్నీ భయంతోటి వణికిపోగా
హోరుగాలిలాగ వచ్చెరా నిన్ను నరికిపోగులెట్ట వచ్చెరా
ఆడామగా కలిసివచ్చెరా నిన్ను మింగివేయటానికొచ్చెరా
రె రె రే....విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదేకాంచనా
హెయ్ మరణమ్రుదంగం ఐ నినుచీల్చవచ్చే కాంచనా
చేసిన సగటు ముగియు వరకు రెప్పలకేది కునుకు కునుకు
కదిలిస్తే మిన్నే బెదురు కదిలొస్తే భూమి అదురు కంటి ఎరుపు
చూడు చూడు ఆరిపోని సెగలు రేపు ముష్కర మూకలు ముక్కలు ముక్కలు
మూడున గుంటలు ముక్కలు చక్కలు చిచ్చర కన్ను తెరుచుకున్నది
జరుగునిక్కడ అశుర సంహారం.........................................................
0 comments:
Post a Comment