
నాకోసం నిను గన్న ఈసీమ మీద ఒట్టు
నేనమ్మేటి అలివేలు మంగమీద ఒట్టు
కడదాక నీతొ నేను సాగుతా......ఓ ఓ
నీమీద ఒట్టు నా ప్రేమ మీద ఒట్టు
నాకోసం నిను గన్న ఈసీమ మీద ఒట్టు
నేనమ్మేటి అలివేలు మంగమీద ఒట్టు
కడదాక నీతొ నేను సాగుతా......
నన్ను నిద్రించమంటూ నిను నాలొ ముద్రించుకుంటూ
కలలెన్నొ పండించె నీకన్నులమీదొట్టు
నేలమీదనే ఉంటూ నను గాలిలోపీల్చుకుంటూ
తనవైపులాగేసె నీనవులమీదొట్టు
చిగురాకును తలపించే నీసిగ్గుమీద ఒట్టు
చిరుగాలై నను తాకె నీచేతిమీద ఒట్టు
నువ్వుంటె నావెంటే చుట్టూర నాకు ఎవరూలేనట్టే
నీమీద ఒట్టు నా ప్రేమ మీద ఒట్టు
నాకోసం నిను గన్న ఈసీమ మీద ఒట్టు
నేనమ్మేటి అలివేలు మంగమీద ఒట్టు
నీడలా వెంట ఉంటూ నను వీడిపోలేను అంటూ
తెగ ఊసులే చేప్పెనీ ఊహలమీదొట్టు
నీకు తోడు నేనంటూ నను వేడిగా పట్టూకుంటూ
ఈగుండె సడి పెంచేనీ ఊపిరిమీదొట్టు
దేవతనే మరిపించే నీరూపమ్ మీద ఒట్టు
మోహాన్నే కలిగించే నీమౌనంమీద ఒట్ట్టు
వస్తాలె నీకోసమే ప్రతిజన్మలోను జతగా చేరుతా
నీమీద ఒట్టు నా ప్రేమ మీద ఒట్టు
నాకోసం నిను గన్న ఈసీమ మీద ఒట్టు
నేనమ్మేటి అలివేలు మంగమీద ఒట్టు
0 comments:
Post a Comment