
అరెరరె అరెరరె ఎంతటి ఘనమయ్యా
ప్రాణాలిచ్చే మమతల్లో ప్రాణం తీసే పంతాల్లో
నేలను చిందిన నెత్తురు చుక్కల లెక్కలు తేలని ఇతిహాసాలు
అరెరరె అరెరరె అరెరరె అరెరరె
అరెరరె అరెరరె ఎంతటి ఘనమయ్యా
హే... కాలు నీదని కన్ను నీదని ఆలోచనలకు తావిస్తే
కక్షలు తీర్చే కమ్మని విందు చేయిజారి పోదా
రక్తం పంచుకు పుట్టిన వాళ్ళే మనవాళ్ళేనని అనుకొని ఉంటే
కురుక్షేత్ర రణరంగ దృశ్యమే నవ్వులపాలై పోయేదికదా
కౌరవులెవరో పాండవులెవరో ఆలోచించేలోగా
తల తెగి మొండెం వేరై రక్తం ఏరై మోడై పోయే చితుకుల బ్రతుకులు
అరెరరె అరెరరె అరెరరె అరెరరె
అరెరరె అరెరరె అరెరరె అరెరరె
అరెరరె అరెరరె ఎంతటి ఘనమయ్యా
ప్రాణాలిచ్చే మమతల్లో ప్రాణం తీసే పంతాల్లో
నేలను చిందిన నెత్తురు చుక్కల లెక్కలు తేలని ఇతిహాసాలు
అరెరరె అరెరరె అరెరరె అరెరరె......... హా.........
0 comments:
Post a Comment