నీటి మీది కాగితాన కావ్యాలెన్నో
నీటి మీది కాగితాన కావ్యాలెన్నో ఎద సెగలెన్నెన్నో

రాసినోడు ఎవరు ఏ మోగదేవుడో అమ్మ రొమ్ము నుండి
విడదీసినాడురో వీదిపాలు అయిన మనుజునీ కధరా

నీడలేదులే ఏ గూడు లేదులే బతుకున బతుకులో
మెతుకు కరువులే కారు చీకటే నను బాటసారిలా
వెలుగుకే వెలితిలా తరిమివేసెలే ఏదారి కానరాక
ఏకాకిగ ఉండగా కొండంత కరుణ చూపి కాపాడినవేలలో
మంచనీ చెడు అనీ నాకు తెలియదూ
నీటి మీది కాగితాన కావ్యాలెన్నో ఎద సెగలెన్నెన్నో
నీటి మీది కాగితాన కావ్యాలెన్నో ఎద సెగలెన్నెన్నో
సొంతమన్నదీ మనకేది చెప్పరా ఉందనీ లేదనీ ఎంత
మాయరా గాలిపటమునూ ఒక పూలతీగతో కలిపినా
పలితమే కన్నతల్లిరా కన్నంత కడుపుతీపి చూపించిన
తండ్రినీ ఏనాడు కానరాని దేవుడితో పోల్చనూ
చేసినా మేలునూ మరువలేనురా
నీటి మీది కాగితాన కావ్యాలెన్నో ఎద సెగలెన్నెన్నో
నీటి మీది కాగితాన కావ్యాలెన్నో ఎద సెగలెన్నెన్నో
రాసినోడు ఎవరు ఏ మోగదేవుడో అమ్మ రొమ్ము నుండి
విడదీసినాడురో వీదిపాలు అయిన మనుజునీ కధరా
నీటి మీది కాగితాన కావ్యాలెన్నో ఎద సెగలెన్నెన్నో
0 comments:
Post a Comment