
ప్రశ్నంటే నింగిని నిలదీసే అలా
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా
బదులంటే ఎక్కడో ఏచోటో లేదురా
సోదించే చూపులో ఓ నలుపై గెలుపై దాగుందంటా
ప్రతి ఒక రోజిలా ఒకటే ఊసగా..............
బ్రతుకును లాగటం బరువేగా మనసుకీ
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా
అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ
ప్రశ్నంటే.. ప్రశ్నంటే నింగిని నిలదీసే అలా
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా
పలు రంగులు దాగిలేవా కనిపించే తెలుపులోన
చిమ్మ చీకటి ముసుగులోను నీడలు ఎన్నో ఉండవా
అడగనిదే ఏజవాబు తనకై తానెదురుకాదు
అద్భుతమే దొరుకుతుంది అన్వేషించరా
హే ప్రతి ఒక రోజిలా ఒకటే ఊసగా
బ్రతుకును లాగటం బరువేగా మనసుకీ
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా
అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ
ప్రశ్నంటే నింగిని నిలదీసే అలా
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా
హే ఎపుడో ఎన్నేలనాడో నాందిగా
మౌదలైనవేట ఎదిగే ప్రతి మలుపుతోను
మార్చలేదా మనిషి బాట.............
తెలియని తనమే పునాది తెలిసిన క్షనమే ఉగాది
తెలివికి గిరి గీత ఏది ప్రయత్నించరా
హే ప్రతి ఒక రోజిలా ఒకటే ఊసగా..............
బ్రతుకును లాగటం బరువేగా మనసుకీ
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా
అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ
ప్రశ్నంటే నింగిని నిలదీసే అలా
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా
0 comments:
Post a Comment