
ఫేర్ వెల్ ఫేర్ వెల్ విషింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఫేర్ వెల్
ఫేర్ వెల్ ఫేర్ వెల్ విషింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఫేర్ వెల్
మరోప్రభాతం మరోప్రకాశం ఎదుటనిలిచి ఉందీ
మరోప్రభాతం మరోప్రకాశం ఎదుటనిలిచి ఉందీ
వీడుకోలు పాడినా వేడుకైన వేదనా
జీవితాన వీడునా ఈజ్నాపకాల స్పందనా
మరోప్రభాతం మరోప్రకాశం ఎదుటనిలిచి ఉందీ
ఏ ఆంక్షలులేనీ ఆకాంక్షలుగానీ ఏ వంచన తెలియని స్నేహమిదీ
సావాసంలోనీ సంతోషమెగానీ ఏ స్వార్దమ్ కలపని బంధమిదీ
మరుపేరాని మధుర స్మ్రుతిగా చెరిపే వీలులేని కధగా
మనతోపాటు రానున్న మలుపు ఇదీ
మనగుండెల సడిలో పలికే రాగమిదీ
వీడుకోలు పాడినా వేడుకైన వేదనా
జీవితాన వీడునా ఈజ్నాపకాల స్పందనా
లోకంలోకి కొత్త అడుగూ వేసేముందు కాస్త అడుగూ
ఏంనేర్పింది ఇన్నాళ్ల ఈచదువూ కలలే మాని కళ్లు తెరువూ
కాలం విలువ తెలిసి నడువూ అపుడే నిన్ను నువ్వు గెలుచుకోగలవూ
నిన్నటికీ రేపటికీ మద్య వంతెనగా నినునిలిపే విద్యా
సొంతమయే అనుభవమే చూస్తావూ............
నీసంతకమే చెరితగ చేస్తావూ.............
వీడుకోలు పాడినా వేడుకైన వేదనా
జీవితాన వీడునా ఈజ్నాపకాల స్పందనా
మరోప్రభాతం మరోప్రకాశం ఎదుటనిలిచి ఉందీ
మరోవిలాసం మరో వికాసం మేలుకొలుపుతోందీ
0 comments:
Post a Comment