
పున్నమి వెన్నెలకే కన్నుల గంతలివీ
చూపులకందక దీపమునార్పిన చేతలు ఎవ్వరివీ
నిజమును ముసిరిన నివురది ఏమిటి.........................
నిదురను చెరిపిన కలవరమేమిటి.......................
వెలుగుకు వెనుకన వివరము ఏమిటి.......................
వేలుపు కొలువున విలయమదేమిటి,........................
పలు ప్రశ్నలకొక బదులది ఏమిటి..........................
తలపును తొలిచెను తరగని చీకటి.........................
నరుడా గురుడా ఎవరా మూలము.................
కాలుని పాసమై కదిలెను కాలము.................
జరిగెడి ఇదియే దైవ మహత్యము కానిచొ ఇదియే మానవ యత్నము
తెలియునదెప్పుడీ మాయ రహస్యము తెలియుట మాత్రమవస్యం
అవస్యము బ్రతుకొక తపముగ పరుగెడు పయనము తలవని
మలుపుగ కనుగొను విజయము.............................................
పున్నమి వెన్నెలకే కన్నుల గంతలివీ
చూపులకందక దీపమునార్పిన చేతలు ఎవ్వరివీ
0 comments:
Post a Comment