
అరెరే అది పిలుపో తొలి వలపో మైమరపో
అదిరే కుడి కన్నై నిను చేరే మలుపో
నువు నచ్చావన్నదిగా నిను రా రమ్మనదిగా
వడి వడిగా పరుపైపో తనవడిలో పడిపో
ఆకాశానైనా ఇలదించే ఏమహిమో
భూగోలానైనా నడిపించే బలమో
ప్రియస్వరమై పిలిచెనుగా అనువనువును కుదిపెనుగా
వడి వడిగా పరుపైపో తనవడిలో పడిపో
లాగే దారమే ఎటుదాగుందో ఏమో
వెలిపోతుందలా మనసూ....................
గాల్లో బానమే పువ్వై తాకిందేమో
విరబూసిందిగా వయసూ..............
హేయ్ ఒకటికి ఇంకొకటని కలిపీ రెండంటున్నా లోకం
ఒకటేనని నమ్మేస్తుందీ వెలకువలో మైకం.........
సత్యంతో పనిలేదంటూ స్వప్నంలోనే పయనం
చీకటినే సిరివెన్నలగా చూస్తుంది నయనం
నాకేం వద్దులే అంతా నీదే ప్రేమా అనిపిస్తుందీ సమయం
నచ్చిన దారికే గొడుగై పువ్వుల మడుగై అడుగేస్తుంది నీహృదయం
హే ఎనిన్నా మొన్నల కాలం గురుతుకు రాన్నంటుందే
రాబోయే రేపటికైనా ఆలోచనలేదే...................
ఈనిమిషం లోనే ఉన్నా ఏచోటో తెలిదే..............
జతమనసున చెరిసగమై నీమనసే ఒదిగిందే.............
ఎపుడైతే ప్రేమా మొదలైందే నీ ఎదలో
అపుడే నీస్వార్దం కలిసిందే గాల్లో
ఇక ప్రేమంటే నువ్వూ తానే నీ చిరునవ్వూ
వడి వడిగా పరుపైపో తనవడిలో పడిపో







0 comments:
Post a Comment