Widgets


ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలీ song from pournami


ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలీ

ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలీ

కో అంటూ కబురుపెడితే రగిలే కొండగాలీ

కూ అంటూ తిరిగిరాదా నింగే పొంగి పొరలీ

ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలీ

ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలీ

హో తనలో చినుకే బరువై కరిమొబ్బే వదిలినా

చెరలో కునుకే కరువై కలవరమే తరిమినా

వనమే నన్ను తనవడిలో అమ్మై పొదుగుకున్నదనీ

పసిపాపల్లే కొమ్మలలో ఉయ్యాలూపుతున్నదనీ

నెమ్మదిగా నామదికీ నమ్మకమందించేదెవరూ

ఎవరో ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలీ

ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలీ

హో వరసే కలిపే చనువై నను తడిమే పూలతో

కనులే తుడిచే చెలిమై తలనిమిరే జాలితో

ఎపుడో కన్న తీపికలా  ఎదురౌతుంటె దీపికలా

శిలలో ఉన్న శిల్పకలా నడకే నేర్చుకున్నదిలా

దుందుడుకో ముందడుగో సంగతి అడిగె వారెవెరో

ఎవరో.............................................
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory