
ఎందుకో అసలెందుకో ఈమనసిలా
నాలో మాటలన్నీ మౌనమే చేసిందిలా
నాకళ్లలోనె నిజమే రెప్ప చాటులోన దాచి
నీతో గుండె విప్పీ చెప్పకుండా తాను వుండగలదా
ఎందుకో అసలెందుకో ఈమనసిలా
నాలో మాటలన్నీ మౌనమే చేసిందిలా
ఓ మాట ఉంది పెదవే చేరనంది
ఓ బంధమేదొ ఎదురై ఆపుతోంది
మబ్బుల్లోన ఉన్న జాబిలమ్మ వెన్నెల్లొ కలిసేదెలా
ఊహల్లోన ఉన్న ఊసులన్ని ఉండిపోయి వంటరయ్యే
ఎందుకో అసలెందుకో ఈమనసిలా
నాలో మాటలన్నీ మౌనమే చేసిందిలా
నాకళ్లలోనె నిజమే రెప్ప చాటులోన దాచి
నీతో గుండె విప్పీ చెప్పకుండా తాను వుండగలదా
చూస్తున్నదంతా ఓ సూన్యంలా ఉంది
ఈవేకువంతా నడిరేయల్లె ఉందీ
నాలో అంతులేని వింతభారమెన్నాళ్లు మోయాలిలా
ఎదలో నిండి ఉన్న ఆశలన్ని స్వాసలోనె దాచుకున్నా
ఎందుకో అసలెందుకో ఈమనసిలా
నాలో మాటలన్నీ మౌనమే చేసిందిలా
To listen this song click on play button
0 comments:
Post a Comment