one way one way జీవితానికి ఎక్కడ ఉందో గమ్యమన్నది
తెలియదు అన్నా ఆగదే మది సాగిపోయే ప్రయాణం
runway లాంటిది కాదుగా ఇది ఎన్నో ఎన్నో మలుపులున్నది
ఎగుడు దిగుడు చూసుకోనిది పరుగు తీసే ప్రవాహం
నీ దారి లోన నవ్వు చిలకరించే మల్లెపూవులెన్నో
తియతియ్యగానె నిన్ను గాయపరిచే తేనేటీగలెన్నో
ఎంత వింతని తెలుసుకో ప్రపంచం అంతుతేలని సృష్టిలో రహస్యం
ఎంత వింతని తెలుసుకో ప్రపంచం అంతుతేలని సృష్టిలో రహస్యం
one way one way జీవితానికి ఎక్కడ ఉందో గమ్యమన్నది
తెలియదు అన్నా ఆగదే మది సాగిపోయే ప్రయాణం
జగమే ఒక మాయ బ్రతుకే ఒక మాయ అని అన్నది ఎవరో... అది విన్నది ఎవరో
మనసునే పట్టిలాగే ప్రేమెంత మాయ అనుకున్నా
ఒక్క చూపుకై బ్రతికే ఆ మాయలో హాయి లేదా
ఇప్పుడిక్కడ రేపు ఎక్కడ అన్న ఈ మిస్టరీకి
బదులు ఎవ్వరూ చెప్పలేరుగా అందుకే నేటిరోజే నీది
ఎంత చిన్నదో తెలుసుకో జీవితం అంతకన్న అతి చిన్నదీ యవ్వనం

తను పుట్టిన చోటే ఉంటుందా చినుకు తను వెళ్ళే చోటే.. తెలుసా మరి తనకు
నిన్న అన్నదిక రాదు గతమంటె ఎందుకా మోజు
రేపు అన్న ఆ రోజు కలలాంటిదే కదా మనకు
ఎన్నివేల చిరు వేషాలో కలిపి మనిషి అవతారం
కళ్ళు మూసి తెరిచేలోగా మారిపోతుంది నాటకరంగం
ఎంత చిత్రమో తెలుసుకో ప్రపంచం తెలుసుకొంటె నీ సొంతమే సమస్తం
ఎంత చిత్రమో తెలుసుకో ప్రపంచం తెలుసుకొంటె నీ సొంతమే సమస్తం
one way one way జీవితానికి ఎక్కడ ఉందో గమ్యమన్నది
తెలియదు అన్నా ఆగదే మది సాగిపోయే ప్రయాణం
నీ దారి లోన నవ్వు చిలకరించే మల్లెపూవులెన్నో
తియతియ్యగానె నిన్ను గాయపరిచే తేనేటీగలెన్నో
ఎంత వింతని తెలుసుకో ప్రపంచం అంతుతేలని సృష్టిలో రహస్యం
ఎంత వింతని తెలుసుకో ప్రపంచం అంతుతేలని సృష్టిలో రహస్యం
0 comments:
Post a Comment