
నాలో ఊహలకు నాలో ఊసులకు
అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు
నడకలు నేర్పావు
పరుగులుగా పరుగులుగా
అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి
నాలో ఊహలకు నాలో ఊసులకు
అడుగులు నేర్పావు
కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే
పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే
శ్వాసలోన పెనుతుఫానే
ప్రళయమౌతోందిలా
నాలో ఊహలకు నాలో ఊసులకు
అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు
నడకలు నేర్పావు
మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ
మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ
నిన్ను చూస్తూ ఆవిరౌతూ
అంతమవ్వాలనే
నాలో ఊహలకు నాలో ఊసులకు
అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు
నడకలు నేర్పావు
పరుగులుగా పరుగులుగా
అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి
నాలో ఊహలకు నాలో ఊసులకు
అడుగులు నేర్పావు







0 comments:
Post a Comment