Widgets


మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా పనేం తోచక పరేషానుగా గడబిడ పడకు అలా song from Seethamavakitlo sirimalle chettu


మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా
పనేం తోచక పరేషానుగా గడబిడ పడకు అలా
మతోయేంతగా శృతే పెంచగా విచారాల విలవిలా
సరే చాలిక అలా జాలిగా తికమక పెడితె ఎలా
కన్నీరై కురవాలా మన చుట్టూ ఉండే లోకం తడిసేలా
ముస్తాబే చెదరాలా నిను చూడాలంటే అద్దం జడిసేలా
ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా
కదా మరెందుకు గోలా
అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా
వృథా ప్రయాస పడాలా
మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా
సరే చాలిక అలా జాలిగా తికమక పెడితె ఎలా 

ఎండలను దండిస్తామా వానలను నిందిస్తామా
చలినెటో తరిమేస్తామా ఛీ పొమ్మనీ...
కస్సుమని కలహిస్తామా ఉస్సురని విలపిస్తామా
రోజులతొ రాజీ పడమా సర్లెమ్మనీ...
సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం
పూటకొక పేచీ పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం
ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా
కదా మరెందుకు గోలా
అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా
వృథా ప్రయాస పడాలా 

చెమటలేం చిందించాలా శ్రమపడేం పండించాలా
పెదవిపై చిగురించేలా చిరునవ్వులూ...
కండలను కరిగించాలా కొండలను కదిలించాలా
చచ్చి చెడి సాధించాలా సుఖశాంతులూ...
మనుషులనిపించే రుజువు మమతలను పెంచే ఋతువు
మనసులను తెరిచే హితవు వందేళ్లైనా వాడని చిరునవ్వు
ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా
కదా మరెందుకు గోలా
అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా
వృథా ప్రయాస పడాలా 


To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory