
ఎరుపులోలాకు కులికెను కులికెను
ముక్కుబుల్లాకు మెరిసెను మెరిసెను
ఎరుపులోలాకు కులికెను కులికెను
ముక్కుబుల్లాకు మెరిసెను మెరిసెను
అమ్మమ్మా అందమే ఏనుగెక్కి పోతోందే
కళ్ళతో కొంటెగా సైగలేవొ చేస్తోంది
రాజస్థాని కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ
ఎరుపులోలాకు కులికెను కులికెను
ముక్కుబుల్లాకు మెరిసెను మెరిసెను
మనసంతా మనసంతా మరుమల్లెల పులకింతా
వయసంతా వయసంతా చిరుకవితల కవ్వింతా
మనసంతా మనసంతా మరుమల్లెల పులకింతా
వయసంతా వయసంతా చిరుకవితల కవ్వింతా
ఏ ఊరి చల్లగాలి ఈ ఊరి కొచ్చెనమ్మ
ఒంటె మీదకెక్కి నన్ను ఊరు చుట్టు తిప్పెనమ్మ
ఏటి గట్టు ఊరి గట్టు నన్ను చూసి పాడంగ
సంగతులు ఎన్నెన్నో వంతులేసి చెప్పంగ
రాజస్థాని కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ
ఎరుపులోలాకు కులికెను కులికెను
ముక్కుబుల్లాకు మెరిసెను మెరిసెను
ఆకాశం ఆకాశం ఈ సుందర ఆకాశం
బహుదూరం బహుదూరం మనకందని నవలోకం
ఆకాశం ఆకాశం ఈ సుందర ఆకాశం
బహుదూరం బహుదూరం మనకందని నవలోకం
చుట్టి చుట్టి నన్ను చుట్టె చక్కనైన తోకచుక్క
ముద్దు ముద్దు మాటలాడె ముచ్చటైన పాలపిట్ట
అందాలే చిందెనులే లేత నుదుటి కుంకుమలు
పగ్గాలే వేసెనులే నీలి నీలి ముంగురులు
రాజస్థాని కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ
ఎరుపులోలాకు కులికెను కులికెను
ముక్కుబుల్లాకు మెరిసెను మెరిసెను
ఎరుపులోలాకు కులికెను కులికెను
ముక్కుబుల్లాకు మెరిసెను మెరిసెను
అమ్మమ్మా అందమే ఏనుగెక్కి పోతోందే
కళ్ళతో కొంటెగా సైగలేవొ చేస్తోంది
రాజస్థాని కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ
ఎరుపులోలాకు కులికెను కులికెను
ముక్కుబుల్లాకు మెరిసెను మెరిసెను
0 comments:
Post a Comment