Widgets


ఒక బృందావనం... సోయగం... ఎద కోలాహలం... క్షణక్షణం... ఒకే స్వరం సాగేను తియ్యగా song from Gharshana 1988

 

ఒక బృందావనం... సోయగం...
ఎద కోలాహలం... క్షణక్షణం...
ఒకే స్వరం సాగేను తియ్యగా
ఒకే సుఖం విరిసేను హాయిగా
ఒక బృందావనం... సోయగం...

నే సందెవేళ జాబిలీ...
నా గీతమాల ఆమనీ...
నా పలుకు తేనె కవితలే...
నా కులుకు చిలక పలుకులే...
నే కన్న కలల మేడ నందనం...
నాలోని వయసు ముగ్ధ మోహనం...
ఒకే స్వరం సాగేను తియ్యగా
ఒకే సుఖం విరిసేను హాయిగా
ఒక బృందావనం... సోయగం...

నే మనసు పడిన వెంటనే...
ఓ ఇంద్రధనుసు పొందునే...
ఈ వెండి మేఘ మాలనే...
నా పట్టు పరుపు చేయనే...
నే సాగు బాట జాజి పూవులే...
నాకింక సాటి పోటి లేదులే...
ఒకే స్వరం సాగేను తియ్యగా
ఒకే సుఖం విరిసేను హాయిగా
ఒక బృందావనం... సోయగం...
ఒకే స్వరం సాగేను తియ్యగా
ఒకే సుఖం విరిసేను హాయిగా
ఒక బృందావనం... సోయగం...
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory