అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి
కలవో అలవో వలవో నా ఊహల హాసిని
మదిలో కథలా మెదిలే నా కలల సుహాసిని
ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి
తీపికన్నా ఇంకా తియ్యనైనా తేనె ఏది అంటే
వెంటనే నీ పేరని అంటానే
హాయికన్నా ఎంతో హాయిదైనా చోటే ఏమిటంటే
నువ్వు వెళ్ళే దారని అంటానే
నీలాల ఆకాశం నా నీలం ఏదంటే
నీ వాలుకళ్ళల్లో ఉందని అంటానే
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి
నన్ను నేనే చాలా తిట్టుకుంటా
నీతో సూటిగా ఈ మాటలేవి చెప్పకపోతుంటే
నన్ను నేనే బాగా మెచ్చుకుంటా
ఏదో చిన్నమాటే నువ్వు నాతో మాటాడావంటే
నాతోనే నేనుంటా నీ తోడై నాకుంటే
ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి
0 comments:
Post a Comment