Widgets

కన్నుల్లో నీ రూపమే... గుండెల్లో నీ ధ్యానమే... song from Ninne pelladatha

కన్నుల్లో నీ రూపమే... గుండెల్లో నీ ధ్యానమే...
నా ఆశ నీ స్నేహమే... నా శ్వాస నీ కోసమే...
ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే....

మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా....
నీ నీలి కన్నుల్లొ పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా....
గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతొ ఏమో ఎలా వేగడం
కన్నుల్లో నీ రూపమే... గుండెల్లో నీ ధ్యానమే...
నా ఆశ నీ స్నేహమే... నా శ్వాస నీ కోసమే...

అదిరేటి పెదవుల్ని బ్రతిమాలుతున్నాను మదిలోని మాటేదనీ....
తల వంచుకుని నేను తెగ ఎదురు చూశాను నీ తెగువ చూడాలనీ....
చూస్తూనె వేళంత తెలవారిపోతుందొ ఏమో ఎలా ఆపడం
కన్నుల్లో నీ రూపమే... గుండెల్లో నీ ధ్యానమే...
నా ఆశ నీ స్నేహమే... నా శ్వాస నీ కోసమే...
ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే....
కన్నుల్లో నీ రూపమే... గుండెల్లో నీ ధ్యానమే...
నా ఆశ నీ స్నేహమే... నా శ్వాస నీ కోసమే...

0 comments:

Post a Comment

LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory