
నా యదలో చోటే కోరవద్దు
మన యదలో ప్రేమను మాటనొద్దు
ఇవి పైపైన మాటలు లే
నీ నీడై నడిచే ఆశ లేదే
నీ తోడై వచ్చే ధ్యాస లేదే
నీ తోటే ప్రేమ పోతేపోని
అని అబద్దాలు చెప్పలేనులే
నీ జతలోన నీ జతలోన
ఈ ఎండాకాలం నాకు వానాకాలం
నీ కలలోన నీ కలలోన
మది అలలాగా చేరు ప్రేమ తీరం
నీ యదలో నాకు చోటే వద్దు
నా యదలో చోటే కోరవద్దు
మన యదలో ప్రేమను మాటనొద్దు
ఇవి పై పైన మాటలు లే
చిరుగాలి తరగంటి నీ మాటకే
యద పొంగేను ఒక వెల్లువై
చిగురాకు రాగాల నీ పాటకే
తనువూగేను తొలి పల్లవై
ప్రేమ పుట్టాక నా కళ్ళలో
దొంగ చూపేదో పురి విప్పెనే
కొంచెం నటనున్నది కొంచెం నిజమున్నది
ఈ సయ్యాట బాగున్నది
నువ్వు వల వేస్తే నువు వల వేస్తే
నా యద మారే నా కథ మారే
అరె ఇది ఏదో ఒక కొత్త దాహం
అది పెరుగుతుంటే వీచే చెలి స్నేహం
ఒకసారి మౌనంగ నను చూడవే
ఈ నిమిషమే యుగమవునులే
నీ కళ్ళలో నన్ను బంధించవే
ఆ చెర నాకు సుఖమవునులే
నిన్ను చూసేటి నా చూపులో
కలిగే ఎన్నెన్ని ముని మార్పులో
పసిపాపై ఇలా నా కనుపాపలే
నీ జాడల్లో దోగాడెనే
తొలి సందెలలో తొలి సందెలలో
ఎరుపే కాదా నీకు సింధూరం
మలి సందెలలో మలి సందెలలో
నీ పాపిటిలో ఎర్ర మందారం
నీ యదలో నాకు చోటే వద్దు
నా యదలో చోటే కోరవద్దు
మన యదలో ప్రేమను మాటనొద్దు
ఇవి పైపైన మాటలు లే
నీ నీడై నడిచే ఆశ లేదే
నీ తోడై వచ్చే ధ్యాస లేదే
నీ తోటే ప్రేమ పోతేపోని
అని అబద్దాలు చెప్పలేనులే







0 comments:
Post a Comment