Widgets


ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు కిం కర్తవ్యం అని కలవరపడటం కొందరి తరహా song from Seethamavakitlo sirimalle chettu

 


ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు
కిం కర్తవ్యం అని కలవరపడటం కొందరి తరహా
అవకాశం చూసుకుంటు ఆటంకాలొడుపుగ దాటుకుంటు
వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా
ఏదో తలవడం వేరే జరగడం సర్లే అనడమే వేదాంతం
దేన్నో వెతకడం ఎన్నో అడగటం ఎపుడూ తెమలని రాద్ధాంతం
ఏం చేద్దాం అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం
ఏం చూద్దాం మునుముందేముందో తెలియని చిత్రం
ఏమందాం మననెవరడిగారని ఏమని అంటాం
ఏం విందాం తర తరికిట తక తక ధూం ధూం తక ధూం
ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు
కిం కర్తవ్యం అని కలవరపడటం కొందరి తరహా
అవకాశం చూసుకుంటు ఆటంకాలొడుపుగ దాటుకుంటు
వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా 

ఫాలో పదుగురి బాట బోలో నలుగురి మాట
లోలో కలవరపాటా దాంతో గడవదు పూట
ఇటా అటా అని ప్రతొక్క దారిని నిలేసి అడగకు సహోదరా
ఇదే ఇదే అని ప్రమాణ పూర్తిగ తెగేసి చెప్పేదెలాగరా
ఇది గ్రహించినారీ మహాజనం ప్రయాస పడి ఏం ప్రయోజనం
సిమెంట్ భూతల సహారెడారిది నిలవడం కుదరదే కదలరా
ఏం చేద్దాం అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం
ఏం చూద్దాం మునుముందేముందో తెలియని చిత్రం
ఏమందాం మననెవరడిగారని ఏమని అంటాం
ఏం విందాం తర తరికిట తక తక ధూం ధూం తక ధూం 

ఎన్నో పనులను చేస్తాం ఏవో పరుగులు తీస్తాం
మ్.హూ... సతమతమవుతాం ఓహో.. బతుకిదె అంటాం
ఆటంకు తెలియని ప్రయాణమే యుగ యుగాలుగా మన అయోమయం
వెనక్కు తిరగని ప్రవాహమే ఏ తుఫానో తరిమిన ప్రతీక్షణం
ఇది పుటుక్కు జర జర డుబుక్కు మే అడక్కు అది ఒక రహస్యమే
ఫలాన బదులని తెలీని ప్రశ్నలు అడగటం అలగటం తగదుగా
ఏం చేద్దాం అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం
ఏం చూద్దాం మునుముందేముందో తెలియని చిత్రం
ఏమందాం మననెవరడిగారని ఏమని అంటాం
ఏం విందాం తర తరికిట తక తక ధూం ధూం తక ధూం
ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు
కిం కర్తవ్యం అని కలవరపడటం కొందరి తరహా
అవకాశం చూసుకుంటు ఆటంకాలొడుపుగ దాటుకుంటు
వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా  
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory