Widgets


నీల గగనా ఘనవిచలనా ధరణిజా శ్రీ రమణ song from Godavari

నీల గగనా ఘనవిచలనా ధరణిజా శ్రీ రమణ
మధుర వదనా నళిన నయనా మనవి వినరా రామా
రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట
రామ చక్కని సీతకి

ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తినా రాముడే
ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో
రామ చక్కని సీతకి

ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పె చెప్పలేమని కనులు చెప్పే
నల్లపూసైనాడు దేవుడు నల్లనీ రఘురాముడు
రామ చక్కని సీతకి

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే
చూసుకోమని మనసు తెలిపె మనసు మాటలు కాదుగా
రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట
రామ చక్కని సీతకి

ఇందువదన కుందరదనా మందగమనా భామా
ఎందువలన ఇందువదన ఇంత మదనా ప్రేమా
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory