Widgets


కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను song from Gharshana 1988

కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకివే శ్రీకారమే కావె
కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే

ఆకుల పై రాలు ఆ..
ఆకుల పై రాలు హిమబిందువువోలే
నా చెలి ఒడిలోన పవళించనా (2)
రాతిరి పగలు మురిపాలు పండించు
చెలికాని యద చేర్చి లాలించనా
నేను నీకు రాగ తాళం
నీవు నాకు వేద నాదం
కురిసేను విరిజల్లులే (||)

కన్నుల కదలాడు ఆశలు శృతి పాడు
వన్నెల మురిపాల కథ ఏమిటో
తలపుల మాటల్లో వలపుల తోటల్లో
ఊహలు పలికించు కళలేమిటో
పెదవుల తెరలోన మధురాల సిరి వాన
మధురిమలు అందించు సుధలేమిటో
పరవశమే సాగి పరువాలు చెలరేగి
మనసులు కరిగించు సుఖమేమిటో
పల్లవించే మోహబంధం
ఆలపించే రాగబంధం

కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకివే శ్రీకారమే కావె
కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory