Widgets


బొమ్మని గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ముద్దిమ్మంది song from Bommarillu

బొమ్మని గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ముద్దిమ్మంది
సర్లే పాపం అని దగ్గరికెళ్తే దాని మనసే నీలో ఉందంది
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది
సరసాలాడే వయసొచ్చింది సరదాపడితే తప్పేముంది
ఇవ్వాలని నాకుంది కాని సిగ్గే నన్ను ఆపింది
దానికి సమయం వేరే ఉందంది
చలిగాలి అంది చెలికి వణుకే పుడుతొంది
వెచ్చని కౌగిలిగా నిను అల్లుకుపొమ్మంది
చలినే తరిమేసే ఆ కిటుకే తెలుసండి
శ్రమపడిపోకండి తమ సాయం వద్దండి
పొమ్మంటావే బాలిక ఉంటానంటే తోడుగా
అబ్బో ఎంత జాలిరా తమరికి నా మీద
ఏం చెయ్యలమ్మా నీలో ఏదో దాగుంది
నీవైపే నన్నే లాగింది
అందంగా ఉంది తనవెంటే పదిమంది పడకుండా చూడు
అని నా మనసంటుంది
తమకే తెలియంది నా తోడై ఒకటుంది
మరెవరో కాదండి అది నా నీడేనండి
నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి
అయ్యో అలక దేనికి నా నీడవి నువ్వేగా
ఈ మాట కోసం ఇన్నాళ్ళుగా వేచుంది
నా మనసు ఎన్నో కలలే కంటుంది
బొమ్మని గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ముద్దిమ్మంది
సర్లే పాపం అని దగ్గరికెళ్తే దాని మనసే నీలో ఉందంది
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది
దాని మనసే నీలో ఉందంది ఆ ముద్దేదో నీకే ఇమ్మంది
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory