ఎవ్వరో... ఎవ్వరో... నను తియ్యని గొంతుతొ పిలిచిందెవ్వరో
ఎవ్వరో... ఎవ్వరో... తన మాటల తేనెలు పంచిందెవ్వరో
మనసుకిది కానుకరో ఇచ్చినది ఎవ్వరో
తనది ఏ పోలికరో పోల్చునది ఎవ్వరో
చిలిపి సిరి మువ్వరో కలిపి తను ఎవ్వరో
ఏమో ఏమో.... నా గుండెతొ గుసగుసలాడిందెవ్వరో
హే... ఆ ముసి ముసి నవ్వుల రూపం ఎవ్వరో
ఎవ్వరో... ఎవ్వరో... ఈ దాగుడు మూతలు ఆడేదెవ్వరో
హే.. హే... ఎంతలా ఏమార్చినా ఊరూ పేరూ జారవే
నిన్నిలా నే మరచినా నువు మాత్రం నను వీడవే
అందగాణ్ణి అంటావే మరి అందకుండ ఉంటావే
హే.. ఆ ప్రాణ వాయువల్లే నువుకూడ కానరావే
ఇంతిలా నన్నుఊరిస్తావే నువ్వెంత అందానివే
ఆ అందం కళ్ళకు కట్టేదెవ్వరో తన చిరునామా చూపెట్టేదెవ్వరో
ఏ.. ఏ... నీ స్వరం వినాలనే కోరిక కలిగిస్తావులే
తక్షణం నీవెవ్వరో తెలియదు అనిపిస్తావులే
నన్ను నువ్వు చూస్తావే మరి నిన్ను నువ్వు దాస్తావే
హే.. అరె నిన్ను చూడాలని మైమరచి పోవాలని
నా ఒళ్ళే కళ్ళై వలేస్తున్నా ఆచూకి చిక్కవులే
ఆ చిక్కని నవ్వుల చక్కనిదెవ్వరో ఆ చక్కెర పలుకుల టక్కరి ఎవ్వరో
ఎవ్వరో... ఎవ్వరో.... అరె ఇందరిలో ఆ సుందరి ఎవ్వరో

0 comments:
Post a Comment