Widgets


నువ్వంటే ప్రాణమనీ నీతోనే లోకమని song from Na Autograph

నువ్వంటే ప్రాణమనీ నీతోనే లోకమని
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకోను నాకు తప్పా
కన్నులకి కలలు లేవు నీరు తప్పా
నువ్వంటే ప్రాణమనీ నీతోనే లోకమని
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకోను నాకు తప్పా
కన్నులకి కలలు లేవు నీరు తప్పా

మనసూ ఉంది మమతా ఉంది పంచుకునే నువ్వు తప్పా
ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలనే ఆశ తప్పా
ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా
ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా
ఎవరిని అడగాలి నన్ను తప్పా
చివరికి ఏమవాలి మన్ను తప్పా
నువ్వంటే ప్రాణమనీ నీతోనే లోకమని
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకనీ

వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావు
జంటై ఒకరి పంటై వెళ్ళావు
కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు
బరువై మెడకు ఉరివైపోయావు
దేవతలోను ద్రోహం ఉందని తెలిపావు
దీపం కూడా దహియిస్తుందని తేల్చావు
ఎవరిని నమ్మాలి నన్ను తప్పా
ఎవరిని నిందించాలి నిన్ను తప్పా

నువ్వంటే ప్రాణమనీ నీతోనే లోకమని
నీ తోడే లేకుంటే బ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకోను నాకు తప్పా
కన్నులకి కలలు లేవు నీరు తప్పా

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory