Widgets


వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే song from Seethamavakitlo sirimalle chettu

 

వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే
ఆగవమ్మో అమ్మో ఎంత దురుసే
అరె అబ్బాయంటే ఎంత అలుసే
నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని
వచ్చా వచ్చా వచ్చా అన్నీ తెలిసే
వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే 

నీ వలన తడిశా నీ వలన చలిలో చిందేశా
ఎందుకని తెలుసా నువ్వు చనువిస్తావని ఆశా
జారు పవిటని గొడుగుగ చేశానోయ్
అరె ఊపిరితో చలి కాశానోయ్
హే ఇంతకన్న ఇవ్వదగ్గ ఎంతదైన ఇక్కడుంటె
తప్పకుండ ఇచ్చి తీరుతాను చెబితే
వాన చినుకులు
వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే 

సిగ్గులతొ మెరిశా గుండె ఉరుములతో నిను పిలిచా
ముద్దులుగ కురిశా ఒళ్ళు హరివిల్లుగ వంచేశా
నీకు తొలకరి పులకలు మొదలైతే
నా మనసుకి చిగురులు తొడిగాయే
నువ్వు కుండపోతలాగ వస్తె బిందెలాగ ఉన్నఊహ
పట్టుకున్న హాయికింక లేదు కొలతే
వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే
ఆగవమ్మో అమ్మో ఎంత దురుసే
అరె అబ్బాయంటే ఎంత అలుసే
నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని
వచ్చా వచ్చా వచ్చా అన్నీ తెలిసే 
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory