
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఎద లోతులో... ఏ మూలనో... నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఈ గాలిలో... ఏ మమతలో... మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ
రేగు పండ్లకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ
కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలూ....
దొంగ చాటుగా కాల్చిన బీడీ సుబ్బుగాడిపై చెప్పిన చాడీ
మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం....
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
మొదటి సారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం
నెల పరీక్షలో వచ్చిన సున్న గోడ కుర్చీ వేయించిన నాన్న
పంచుకున్న ఆ పిప్పరమెంటు పీరు సాయుబు పూసిన సెంటూ....
చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారుకెగవేసిన అప్పు
మొదటి ముద్దులో తెలియనితనము మొదటి ప్రేమలో తియ్యందనమూ....
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఎద లోతులో... ఏ మూలనో... నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
0 comments:
Post a Comment