Widgets


ప్రేమలే నేరమా ప్రియా ప్రియా వలపు విరహమా ఓ నా ప్రియా song from Sakhi


ప్రేమలే నేరమా ప్రియా ప్రియా
వలపు విరహమా ఓ నా ప్రియా
మనసు మమత ఆకాశమా
ఒక తారై మెరిసిన నీవెక్కడో..
కలలై పోయెను నా ప్రేమలు
అలలై పొంగెను నా కన్నులు (2)
మదికే అతిధిగ రానేలనో
సెలవైనా అడగక పోనేలనో
ఎదురుచూపుకు నిదరేది
ఊగెను ఉసురే కన్నీరై
మనసు అడిగిన ఆ మనిషెక్కడో
నా పిలుపే అందని దూరాలలో
కలలై పోయెను నా ప్రేమలు
అలలై పొంగెను నా కన్నులు
అనురాగానికి స్వరమేదీ
సాగరఘోషకు పెదవేది (2)
ఎవరికివారే ఎదురుపడి
యదలు రగులు ఎడబాటులలో
చివరికి దారే మెలికపడి
నిను చేరగ నేనీ శిలనైతిని
ఎండమావిలో నావను నే
ఈ నిట్టూర్పే నా తెరచాపలే
కలలై పోయెను నా ప్రేమలు
అలలై పొంగెను నా కన్నులు
వెన్నెల మండిన వేదనలో
కలువ పువ్వులా కలతపడి (2)
చేసిన బాసలు కలలైపోతే
బ్రతుకే మాయగా మిగులుననీ
నీకై వెతికా కౌగిలినై
నీడగా మారిన వలపులతో
అలసి ఉన్నాను ఆశలతో
నను ఓదార్చే నీ పిలుపెన్నడో
కలలై పోయెను నా ప్రేమలు
అలలై పొంగెను నా కన్నులు (2)
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory