Widgets


జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే song from Geethanjali

జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు
తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే

వాగులు వంకలు జలజలా చిలిపిగా పిలిచినా
గాలులు వానలు చిటపటా చినుకులే చిలికినా
మనసు ఆగదు ఇదేమి అల్లరో
తనువు దాగదు అదేమి తాకిడో
కోనచాటు కొండ మఅల్లె లేనివంక ముద్దులాడి
వెళ్ళడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి
జల్లంత కవ్వింత కావాలిలే (||)

సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా
తెలి తెలి మంచులే తెలియని తపనలే తెలుపగా
వానదేవుడే కళ్ళాపి జల్లగా
వాయుదేవుడే ముగ్గేసి వెళ్ళగా
నీలిమంట గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న
కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరికోసమో

జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు
తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory