Widgets


గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే song from Teenmar



గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే 
అడుగు మెరుపులా మారే ఆనందమే వీడదీ బంధమే
ఎటువైపు వెళ్తున్నా వెలుగుల్నే చూస్తున్నా మెరిశావే రంగుల్లోనా...
కల తీరే సమయాన అల నేనై లేస్తున్నా అనుకుందే చేసేస్తున్నా...
దారులన్నీ నాతో పాటుగా... ఊయలూగి పాటే పాడగా...
నను వీడి కదలదు కాలమొకక్షణమైనా...
గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే

ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే
ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరెలే
సందేహమేది లేదుగా సంతోషమంత నాదిగా
చుక్కల్లో చేరి చూపగా ఉప్పొంగుతున్న హోరుగా
చిందేసి పాదమాడగా దిక్కుల్ని మీటి వీణగా
చెలరేగి కదిలెను గాలి తరగలె పైనా
గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే

అలుపే రాదు అంటూ కొలిచా నింగి అంచులనే
జగమే ఏలుకుంటూ పరిచా కోటి కాంతులే
ఇవ్వాళ గుండెలో ఇలా చల్లారిపోని శ్వాసలా
కమ్మేసుకుందే నీ కలా ఇన్నాళ్ళు లేని లోటులా
తెల్లారిపోని రేయిలా నన్నల్లుకుంటే నువ్విలా
నను నేను గెలిచిన ఒంటరిగ నిలిచానే  


To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory