ఎప్పటికీ తన గుప్పిట విప్పదు ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు
ఎందుకిలా ఎదురైనది పొడుపుకదా...
తప్పుకునేందుకు దారిని ఇవ్వదు తప్పు అనేందుకు కారణముండదు
చిక్కులలో పడటం తనకేం సరదా...
బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా... ఆ...
అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా... ఆ...
నిన్నా మొన్నా నీలోపలా కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా
ఈరోజేమైందని ఏదైనా అయ్యిందని నీకైనా కాస్తైనా అనిపించిందా

ఏదోలా చూస్తారే నిన్నో వింతలా
నిన్నే నీకు చూపుతారే పోల్చలేనంతగా
మునపటిలా లేవంటూ కొందరు నిందిస్తూ ఉంటే
నిజమో కాదో స్పష్టంగా తేలేదేలా
సంబరపడి నిను చూపిస్తూ కొందరు అభినందిస్తుంటే
నవ్వాలో నిట్టూర్చాలో తెలిసేదెలా

అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా...
నీ తీరే మారింది నిన్నకీ నేటికి
నీ దారే మళ్ళుతుందా కొత్త తీరానికి
మార్పేదైనా వస్తుంటే నువ్వది గుర్తించకముందే
ఎవరెవరో చెబుతూ ఉంటే నమ్మేదేలా
వెళ్ళే మార్గం ముల్లుంటే ఆ సంగతి గమనించందే
తొందరపడి ముందడుగేసే వీల్లేదెలా

To listen this song click on play button
0 comments:
Post a Comment