Widgets


నచ్చావురా... వదలనురా వదలనురా song from Badrinath

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhFiPUIzzISUj81wPJJkQ7JZ837F9yQVwiTXjgxRTWg7ebKS5jeN_8kSd6qce8mbSdFLpWiC_utKxAqIUyZYHV73Qx4r_SRi5e_bN5keYQikjJuRTuxVxBljSOX8eVksoFhVTCKDNhyphenhyphenukA/s1600/Badrinath-movie-latest-wallpapers-06.jpg 


నచ్చావురా... వదలనురా వదలనురా
మెచ్చానురా... జతపడరా జతపడరా
వరసే నచ్చి అడిగా లేరా వరమే ఇచ్చే ఈ జలధార
నీతో ఏడడుగులు నడవాలన్నది నా కోరికరా
నీడగ తోడుండమే ఇక నా తీరికరా
నచ్చావురా... వదలనురా వదలనురా
మెచ్చానురా... జతపడరా జతపడరా 

కనిపించేదాకా చేస్తా తపస్సు
దేవుడు కనిపిస్తే ఏమడగాలో తెలుసు
నువ్వంటే పడి చస్తుందీ వయసు
నీవైపే లాగేస్తోంది మనసు
అలకైనా కులుకైనా నువు నాతోనని
చావైనా బతుకైనా నే నీతోనని
విన్నానులే... ప్రియా.. నీ మౌన భా..షణం
వస్తానులే.... ప్రియా... వందేళ్ళ ప్రే..మ బంధాలే పండించేలా
నచ్చావురా... వదలనురా వదలనురా
మెచ్చానురా... జతపడరా జతపడరా 

బరువెక్కిందమ్మో బ్రహ్మచర్యం
జరగాలంటుందే ఆ శుభకార్యం
అలవాటైపోతుందే నీ ధ్యానం
ఏదో పొరపాటే చేసెయ్ మంది ప్రాణం
జలధారే పులకించింది నిన్నే తాకి
కలిగేనా ఆ అదృష్టం నాకూ మరి
కాదన్నానా.. సఖా.. కానిచ్చే వే..డుక
లేదంటానా.. ఇకా.. లెమ్మంటే లే..చి నీ వొళ్ళో వాలెయ్యక
నచ్చావురా... వదలనురా వదలనురా
మెచ్చానురా... జతపడరా జతపడరా  
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory