Widgets


ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చే వాడా song from Seethamavakitlo sirimalle chettu


ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా
ఏమడిగినా ఇచ్చే వాడా
ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా
అందరికి నచ్చేసే వాడా
సరిగ్గా సరిగ్గా సరిగ్గా నిలవవెందుకే
బెరుగ్గా బెరుగ్గా ఐపోకే
బదులేది ఇవ్వకుండ వెళ్ళిపోకే
ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా
ఏమడిగినా ఇచ్చే వాడా
ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా
అందరికి నచ్చేసే వాడా 

మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టెయ్యడా
కబురుల చినుకులతో పొడి కలలన్నీ తడిపేయడా
ఊసుల ఉరుకులతో ఊహలకే ఊపిరి ఊదెయ్యడా
పలుకుల అలికిడితో ఆశలకే ఆయువు పోయడా
మౌనమై వాడు ఉంటే... ప్రాణమేమవ్వునో...
నువ్వే నా ప్రపంచం అనేస్తూ వెనక తిరుగుతూ
నువ్వే నా సమస్తం అంటాడే
కలలోన కూడ కాలు కందనీడే
ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా
ఏమడిగినా ఇచ్చే వాడా
ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా
అందరికి నచ్చేసే వాడా 

అడిగిన సమయంలో తను అలవోకగ నను మోయాలి
సొగసుని పొగడడమే తనకలవాటై పోవాలి
పనులను పంచుకునే మనసుంటే ఇంకేం కావాలి
అలకని తెలుసుకుని అందంగా బతిమాలాలి
కోరికేదైనగానీ... తీర్చి తీరాలనీ...
అతన్నే అతన్నే అతన్నే చూడటానికి
వయస్సే తపిస్తూ ఉంటుందే
అపుడింక వాడు నన్ను చేరుతాడే 
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory