
ఏయ్ పిల్లా అట్టా నవ్వేసేసి పారిపోమాకే బాబు
మీరేంట్రా నన్ను సూత్తన్నారు ఎవడి డప్పు వాడు కొట్టండహే అది ఓయ్.. ఎయ్..
ఏ.. గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా
ఏ.. నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతె ఎల్లా
ఏ.. గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా
ఏ.. నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతె ఎల్లా
ఏ సుందరి సుందరి సుందరి మనసునే చేసినావె ఇస్త్రీ
స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ బ్లాక్ బెర్రీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావె ఫ్రెంచ్ జ్యూస్ ఫ్యాక్టరీ
పిల్లా నువ్వు లేని జీవితం నల్లరంగు అంటుకున్న తెల్ల కాగితం
ఒహో పిల్లా నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందుకన్న దారుణం
ఏ.. గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా
ఏ.. నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతె ఎల్లా
పంచదార పెట్టి రుద్దినట్టు మంచి తేనె తెచ్చి అద్దినట్టు
ద్రాక్ష పండు తీసి పిండినట్టు ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టు
వెయ్యి ముగ్గు చుక్కలెట్టినట్టు విన్నాంలే
పొయ్యిమీద పాలు పొంగినట్టు విన్నాంలే
పూటకొక్క పండగొచ్చినట్టు ఏదేదొ ఔతోందే నీ మీద ఒట్టు
సంపకే సంపకే సంపకే నిప్పులాంటి నవ్వులోకి దింపకే
ఏ.. సింపకే సింపకే సింపకే నల్లని రాత్రినే సింపకే రంగుతో నింపకే
పిల్లా నువ్వు లేని జీవితం బ్రేకు లేని బైకునే రయ్యమంటు తోలడం
ఒహో పిల్లా నువ్వు లేని జీవితం ట్రాకు లేని ట్రైనుమీద కుయ్యిమంటు వెళ్లడం
ఒక్క జాణగంట కప్పు కోసం పెద్ద వరల్డ్ కప్ జరుగుతాదే
నీ నవ్వులున్న లిప్పు కోసం చిన్న వరల్డ్ వార్ జరిగినా తప్పు లేదే
కొన్ని వేల కోట్ల అప్పు కోసం కాపు కాసి ఉన్నదంట దేశం
ఒక్క నవ్వు అంట ఇవ్వు పాపం దాన్ని అమ్ముకుంటె అప్పు బాధ తప్పుతాదే
కొట్టినా కొట్టినా కొట్టినా గుండెలో దాగివున్న డప్పుని
రాసినా రాసినా రాసినా నవ్వుపై ఎవ్వరూ రాయని మస్తు మస్తు పాటని
పిల్లా నువ్వు లేని జీవితం తాడు లేని బొంగరాన్ని గిర్రుమంటు తిప్పడం
ఒహో పిల్లా నువ్వు లేని జీవితం నూనెలోంచి వానలోకి జారిపడ్డ అప్పడం
0 comments:
Post a Comment