Widgets

యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా song from Detective Naarada

యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
వేడి ముద్దు అద్దుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో

జవ్వనాలు గిల్లుకున్న వన్నెలమ్మకి ఆ వెన్నెలమ్మ జాడ చెప్పవా
చెలి నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా

వెన్నెల పొదలో మల్లెల గుడిలో విరహంతో సఖి రగలాలా
సఖి నెరిచూపుల చల్లదనంతో జగములే ఊటీ శాయగా
యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో

కన్నె ప్రేమ లేని లేత కన్నెగువ్వకి నీకున్న ప్రేమ దోచిపెట్టవా
కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చనా

ఊసుల బడిలో ఊహల చెలికే ఊపిరులే నీ ఆదరణే
సతి ఆదరణే పతికి మోక్షమని సర్వ శాస్త్రములు చాటగా
యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా
వేడి ముద్దు అద్దుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో
యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
To listen this song click on play button

0 comments:

Post a Comment

LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory