నిన్నటి నిదురలోని కలలలోన
అటులే కమ్మను ఆ కమ్మని తన మాటలే
రుజువై నిన్ను నేను కలుపుకున్నా
నూరేళ్ళు నిన్ను విడననీ హొయ్ ఈ రేయి నేను కలగనే
కలలో బ్రహ్మ పలుకులే తెలుసా నీకు నిజమనీ
నిజమే నిజమే నాక్కూడ తెలుసులే
అడిగా బ్రహ్మని నిన్నిమ్మని నా తోదుగా
నిన్నటి నిదురలోని కలలలోన
మునుపటి జన్మలతో ముడిపడు పుణ్యములే
నీ నీడ నన్ను చేర్చెనే బ్రతుకే నిండు పున్నమి
నా కంటిపాప నీవే నీ కంటిరెప్ప నేనే
ఏ నలుసులింక నిన్ను నేడు తాకలేవులే
కలిసిన మనసులో కలతలు ఉండవులే
జతపడు హృదయములే జగమునే మరుచునులే
నిజముగా కల కాదుగా
నిజమే నిజమే కలలాంటి నిజమిదే
అడిగా బ్రహ్మని నిన్నిమ్మని నా తోడుగా
నిన్నటి నిదురలోని కలలలోన
చిరు చిరు సరసాలకు మురిసిన సరదాలకు
కొరతలు లేని కాపురం తెలియదు వేరు కావటం
నే నాటుతున్న పైరే ఏనాటికైన ఎదిగి
మన కొడుకులా రేపు నీ కడుపు పండులే
గడిచిన గతమంతా చేదుగా మిగిలేనే
ఆ కలిగిన చేదంతా తొలగు నీకికపైనా
నిజముగా ఇది జరుగునా
నిజమే నిజమే నీ ఆశ తీరునే
అడిగా బ్రహ్మని నిన్నిమ్మని నా తోడుగా
నిన్నటి నిదురలోని కలలలోన
అటులే కమ్మను ఆ కమ్మని తన మాటలే
రుజువై నిన్ను నేను కలుపుకున్నా
నూరేళ్ళు నిన్ను విడననీ హొయ్ ఈ రేయి నేను కలగనే
కలలో బ్రహ్మ పలుకులే తెలుసా నీకు నిజమనీ
నిజమే నిజమే నాక్కూడ తెలుసులే







0 comments:
Post a Comment