గుస గుసలాడే గువ్వందం గుచ్చుకున్నా ఆనందం
కన్నులా కవ్విస్తుంటే కాటుకైపోతావా
పూటకో పువ్విచ్చే నా తోటకే వస్తావా
నడుములో చోటిస్తుంటే కడవలా ఉంటావా
సిగ్గునే చిదిపేస్తుంటే చీకటై వస్తావా
చిక్కులో పడ్డాదయ్యో.. చీ పో అన్నా వలపై
మిస మిసలాడే మిస్సందం మిస్సుకాకోయ్ సాయంత్రం
గుస గుసలాడే గువ్వందం గుచ్చుకున్నా ఆనందం (2)
పూల సిరి తనువిస్తా పూటకొక చనువిస్తా
మోజుపడు వయసుల్లో రోజుకొక సొగసిస్తా
నీ పెదవి ఊపిరికిలా మంచు తడి అంటిస్తా
కానడల పోకడలతో నడుముకొక ఊపిస్తా
ఆ.. ఉయ్యాలలుగిస్తా సయ్యాటలాడిస్తా
ఉల్లాస వీణల్లోనే నీ తీగ మీటేస్తా
మిస మిసలాడే మిస్సందం మిస్సుకాకోయ్ సాయంత్రం
గుస గుసలాడే గువ్వందం గుచ్చుకున్నా ఆనందం
కన్నులా కవ్విస్తుంటే కాటుకైపోతావా
పూటకో పువ్విస్తాలే తోటకే వస్తావా
నడుములో చోటిస్తుంటే కడవలా ఉంటావా
సిగ్గునే చిదిపేస్తుంటే చీకటై వస్తావా
చిక్కులో పడ్డాదయ్యో.. చీ పో అన్నా వలపై
మిస మిసలాడే మిస్సందం మిస్సుకాకోయ్ సాయంత్రం
గుస గుసలాడే గువ్వందం గుచ్చుకున్నా ఆనందం
చెక్కిలికి నునుపిస్తా చెమ్మలను మొలిపిస్తా
చిక్కుపడు సొగసుల్లో పీఠముడి విడిపిస్తా
నీ బిరుసు కౌగిలికిలా నా వయసు వరమిస్తా
నా వలపు వాకిట ప్రియా నీకెదురు నే వస్తా
ఆ.. మురిపాల ముగ్గేస్తా పరువాల పక్కేస్తా
కౌగిళ్ళు కాటేస్తుంటే నా కళ్ళు మూసేస్తా
మిస మిసలాడే మిస్సందం మిస్సుకాకోయ్ సాయంత్రం
గుస గుసలాడే గువ్వందం గుచ్చుకున్నా ఆనందం
కన్నులా కవ్విస్తుంటే కాటుకైపోతావా
పూటకో పువ్విస్తాలే తోటకే వస్తావా
నడుములో చోటిస్తుంటే కడవలా ఉంటావా
సిగ్గునే చిదిపేస్తుంటే చీకటై వస్తావా
చిక్కులో పడ్డాదయ్యో.. చీ పో అన్నా వలపై
మిస మిసలాడే మిస్సందం మిస్సుకాకోయ్ సాయంత్రం
గుస గుసలాడే గువ్వందం గుచ్చుకున్నా ఆనందం







0 comments:
Post a Comment