
మధురానుభవమా ప్రేమా
మతిలేనితనమా ప్రేమా
నువు తేల్చగలవా కాలమా
మృదువైన స్వరమా ప్రేమా
పదునైన శరమా ప్రేమా
బదులియ్యగలవా దైవమా
కోనేటి కలువా ప్రేమా
కన్నీటి కొలువా ప్రేమా
బతికించు చలువా ప్రేమా
చితి పేర్చు శిలువా ప్రేమా
యడబాటు పేరే ప్రేమా
పొరబాటు దారే ప్రేమా
బదులియ్యమంటే మౌనమా
మధురానుభవమా ప్రేమా
మతిలేనితనమా ప్రేమా
నువు తేల్చగలవా కాలమా
మృదువైన స్వరమా ప్రేమా
పదునైన శరమా ప్రేమా
బదులియ్యగలవా దైవమా
అరణ్యాల మార్గం నువ్వు
అసత్యాల గమ్యం నువ్వు
పడదోసి మురిసే ప్రణయమా
విషాదాల రాగం నువ్వు
వివాదాల వేదిక నువ్వు
కన్నీరు కురిసే మేఘమా
ఎదురీత కోరే ప్రేమా
యదకోతలే నీ సీమా
నిను చేరుకుంటే నేరమా
మధురానుభవమా ప్రేమా
మతిలేనితనమా ప్రేమా
నువు తేల్చగలవా కాలమా
మృదువైన స్వరమా ప్రేమా
పదునైన శరమా ప్రేమా
బదులియ్యగలవా దైవమా
నడి ఏట నావై నీవు
సుడిలోన పడదోస్తావు
కడదాక తోడై ఉండవు
విడదియ్య బలినే నీవు
విజయాలు అనుకుంటావు
ముడివేయు మంత్రం ఎరుగవు
ఎదురీత కోరే ప్రేమా
యదకోతలే నీ సీమా
నిను చేరుకుంటే నేరమా







0 comments:
Post a Comment