Widgets

యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం song from Jagadekaveerudu Atilokasundari

యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం
నమహో నీ జమ జమ వాటం సుడి రేగింది ఎడా పెడా తాళం
పోజుల్లో నేను యముడంత వాడ్ని మోజుల్లో నీకు మొగుడంటి వాడ్ని
అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం
యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం
నమహో నీ జమ జమ వాటం సుడి రేగింది ఎడా పెడా తాళం

నల్లని కాటుక పెట్టి గాజులు పెట్టి గజ్జా కట్టి
గుట్టుగా సెంటే కొట్టి వడ్డాణాలే ఒంటికి పెట్టి
తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టి
పచ్చని పాదాలకి ఎర్రని బొట్టు పారాణెట్టి
చీకటింతా దీపమెట్టి చీకుచింత పక్కానెట్టి
నిన్ను నాలో దాచిపెట్టి నన్ను నీకు దోచిపెట్టి
పెట్టూపోతా వద్దే చిట్టెంకి చెయి పట్టిన్నాడే కూసే వల్లంకి
పెట్టేది మూడే ముళ్ళన్ని నువ్వు పుట్టింది నాకోసమని
ఇక నీ సొగసు నా వయసు వేడుకొనే ప్రేమలలో
యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం
నమహో నీ జమ జమ వాటం సుడి రేగింది ఎడా పెడా తాళం

పట్టె మంచమేసిపెట్టి పాలు పెట్టి పండు పెట్టి
పక్క మీద పూలు కొట్టి పక్కా పక్కా నోళ్ళు పెట్టి
ఆకులో వక్క పెట్టి సున్నాలెట్టి చిలకా చుట్టి
ముద్దుగా నోట్లో పెట్టి పరువాలన్ని పండపెట్టి
చీర గుట్టు సారే పెట్టి సిగ్గులన్ని ఆరబెట్టి
కళ్ళలోన వత్తులెట్టి కౌగిలింత మాటు పెట్టి
ఒట్టే పెట్టి వచ్చేసాక మామ నిను ఒళ్ళో పెట్టి లాలించేదే ప్రేమా
పెట్టెయ్యి సందె సీకట్లోనా నను కట్టెయ్యి కౌగిలింతల్లోనా
ఇక ఆ గొడవ ఈ చొరవ ఆగవులే అలజడిలో
యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం
నమహో నీ జమ జమ వాటం సుడి రేగింది ఎడా పెడా తాళం
పోజుల్లో నేను యముడంత వాడ్ని మోజుల్లో నీకు మొగుడంటి వాడ్ని
అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం
యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం

To listen this song click on play button

0 comments:

Post a Comment

LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory