Widgets


ఎగిరే ఎగిరే… ఎగిరే ఎగిరే… song from Konchem Istam Konchem Kastam

 

ఎగిరే ఎగిరే… ఎగిరే ఎగిరే…
చూపే ఎగిరెనే చీకటి ఎరగని దారిలో
పాదం ఎగిరెనే భయమే తెలియని బాటలో
ప్రాయం ఎగిరెనే పరిచయమవ్వని తోవలో
ఓ.. fly high in the sky..
ఎగిరే ఎగిరే పైకెగిరే
కలలే అలలై పైకెగిరే
పలుకే స్వరమై పైకెగిరే
ప్రతి అడుగు స్వేచ్చ కోరగా

మనసే అడిగిన ప్రశ్నకే బదులొచ్చెను కదా ఇపుడే
ఎపుడు చూడని లోకమే ఎదురొచ్చెను కదా ఇచటే
ఓ.. ఈ క్షణమే సంబరం ఈ క్షణమే శాశ్వతం
ఈ క్షణమే జీవితం.. తెలిసింది ఈ క్షణం
మౌనం కరిగెనే మాటలు సూర్యుడి ఎండలో
స్నేహం దొరికెనే నవ్వుల చంద్రుడి నీడలో
ప్రాణం పొంగెనే మెరుపుల తారల నింగిలో
fly high in the sky..
ఎగిరే ఎగిరే పైకెగిరే
కలలే అలలై పైకెగిరే
పలుకే స్వరమై పైకెగిరే
ప్రతి అడుగు స్వేచ్చ కోరగా

తెలుపు నలుపే కాదురా పలు రంగులు ఇలా సిద్ధం
మదిలో రంగులు అద్దరా మన కథలకు అదే అర్దం
ఓ.. సరిపోదోయ్ బ్రతకటం నేర్చేయ్ జీవించటం
గమనం గమనించటం పయనంలో అవసరం
చేసేయ్ సంతకం నడిచే కాలపు నుదిటిపై
రాసేయ్ స్వాగతం రేపటి కాలపు పెదవిపై
పంచేయ్ స్నేహితం కాలం చదివే కవితపై
fly high in the sky..
ఎగిరే ఎగిరే పైకెగిరే
కలలే అలలై పైకెగిరే
పలుకే స్వరమై పైకెగిరే
ప్రతి అడుగు స్వేచ్చ కోరగా



0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory