Widgets

అరె చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో చాన్సు దొరికెరో హొయ్య song from Kondaveeti Donga

అరె చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో చాన్సు దొరికెరో హొయ్య
చనకు చనకు చాం పట్టుకో పట్టుకో చంపె దరువులే వెయ్య
హొయ్యారే హొయ్య హొయ్య హొయ్ వయ్యారం సయ్యందయ్యా
హొయ్యారే హొయ్య హొయ్య హొయ్ అయ్యారే తస్సాదియ్యా
చాం చాం చకచాం చకచాం త్వరగా ఇచ్చేయ్ నీ లంచం
చాం చాం చకచాం చకచాం చొరవే చేసెయి మరి కొంచెం
అరె చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో చాన్సు దొరికెరో హొయ్య
హే.. చనకు చనకు చాం పట్టుకో పట్టుకో చంపె దరువులే వెయ్య

నాగ స్వరములా లాగిందయ్యా తీగ సొగసు చూడయ్యా
కాగు పొగరుతో రేగిందయ్యా కోడె పడగ కాటెయ్యా
మైకం పుట్టే రాగం వింటూ సాగేదెట్టాగయ్యా
మంత్రం వేస్తే కస్సు బుస్సు ఇట్టే ఆగాలయ్యా
బంధం వేస్తావా అల్లే అందంతో
పందెం వేస్తావా తుళ్ళే పంతంతో
అరె కైపే రేపే కాటే వేస్తా ఖరారుగా
కథ ముదరగ.. చనకు చనకు చాం పట్టుకో పట్టుకో చంపె దరువులే వెయ్య
అరె చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో చాన్సు దొరికెరో హొయ్య
హొయ్యారే హొయ్య హొయ్య హొయ్ అయ్యారే తస్సాదియ్యా
హొయ్యారే హొయ్య హొయ్య హొయ్ వయ్యారం సయ్యందయ్యా
చాం చాం చకచాం చకచాం చాం చొరవే చేసెయి మరి కొంచెం
చాం చాం చకచాం చకచాం చాం త్వరగా ఇచ్చేయ్ నీ లంచం

అగ్గి జల్లులా కురిసే వయసే నెగ్గలేకపోతున్నా
ఈత ముల్లులా యదలో దిగెరో జాతి వన్నెదీ జాణ
అంతో ఇంతో సాయం చెయ్య చెయ్యందియ్యాలయ్యా
తియ్యని గాయం మాయం చేసే మార్గం చూడాలమ్మా
రాజీకొస్తాలే కాగే కౌగిళ్ళో
రాజ్యం ఇస్తాలే నీకే నా ఒళ్ళో
ఇక రేపోమాపో ఆపే ఊపే హుషారుగా
పదపదమని.. అరె చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో చాన్సు దొరికెరో హొయ్య
చనకు చనకు చాం పట్టుకో పట్టుకో చంపె దరువులే వెయ్య
హొయ్యారే హొయ్య హొయ్య హొయ్ వయ్యారం సయ్యందయ్యా
హొయ్యారే హొయ్య హొయ్య హొయ్ అయ్యారే తస్సాదియ్యా
చాం చాం చకచాం చకచాం చాం త్వరగా ఇచ్చేయ్ నీ లంచం
చాం చాం చకచాం చకచాం చాం చొరవే చేసెయి మరి కొంచెం
అరె చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో చాన్సు దొరికెరో హొయ్య
అహ.. చనకు చనకు చాం పట్టుకో పట్టుకో చంపె దరువులే వెయ్య

0 comments:

Post a Comment

LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory