Widgets


ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు song from Lavakusa


ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు
ఓ…ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు

కంచె యతితముగా చేను మేసినా కాదను వారెవరు
రాజే ఇది శాసనమని పల్కినా ప్రతిఘటించు వారెవరు
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు

కరునామయురిది కాదనలేరా కఠిన కార్యమనబోరా
సాథ్వులకెపుడు వెతలేనా తీరని ధుఃఖపు కథలేనా
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు

ఇనకులమున జనియించిన నృపధులు ఈ దారుణము సహించెదరా
వినువీధిని శ్రేణులుగా నిల్చి విడ్డూరముగా చూచెదరా
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు

ఎండకన్ను ఎరుగని ఇల్లాలికి ఎందుకో ఈ వనవాసాలు
తరచి చూచినా బోధపడవులే దైవ చిద్విలాసాలు
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు

అగ్నిపరీక్షకే నిల్చిన సాథ్విని అనుమానించుట న్యాయమా
అల్పుని మాటయే జనవాక్యమ్మని అల్పుని మాటయే జనవాక్యమ్మని అనుసరించుటే ధర్మమా
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు ఎవరూహించెదరు




0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory