Widgets


మనసున మనసుగా నిలిచిన కలవా song from Love birds




మనసున మనసుగా నిలిచిన కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా (2)

మేఘం నేల ఒళ్ళు మీటే రాగమల్లే ప్రేమావరాల జల్లు కావా
పిలుపే అందుకొని బదులే తెలుపుకొను కౌగిట ఒదిగి ఉండనీవా
నా గుండె కోవెల విడిచి వెళ్ళ తగునా తగునా
మల్లెపూల మాలై నిన్నే వరించి పూజించే వేళ
నిరుక్షించు స్నేహం కోరి జతనై రానా రానా
ఉప్పొంగి పోయే ప్రాయం నిన్ను విడువదు ఏ వేళైనా
నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట
ఏడేడు జన్మలు నేనుంటా నీ జంట
మనసున మనసుగా నిలిచినా కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా

పువ్వై నవ్వులని తేనై మాధురిని పంచే పాట మన ప్రేమా
విరిసే చంద్రకళ ఎగసే కడలి అల పలికే కవిత మన ప్రేమా
కాలాన్ని పరిపాలిద్దాం కన్న కలలే నిజమై
వేటాడు ఎడబాటు ఏనాడు కలగదు ఇంక ఇటుపై
నూరేళ్ళ కాలం కూడా ఒక్క క్షణమై క్షణమై
నువ్వు నేను చెరి సగం అవుదాం వయస్సు పండించే వరమై
ప్రియమైన అనురాగం పలికింది మధు గీతం
తుదే లేని ఆనందం వేచేనే నీ కోసం
మనసున మనసుగా నిలిచినా కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా………..

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory