Widgets


కోనలో సన్నజాజిమల్లి జాజిమల్లి మేనులో పొన్నపూలవల్లి పాలవెల్లి song from Maharshi

 


కోనలో సన్నజాజిమల్లి జాజిమల్లి
మేనులో పొన్నపూలవల్లి పాలవెల్లి
వేణిలో కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో అనురాగవల్లి రాగవల్లి
కావ్యాలకే హో.. శ్రీకారమై హో..
కస్తూరి తాంబూళమీవే
కోరుకో సన్నజాజిమల్లి జాజిమల్లి
ఏలుకో కన్నె సోకులన్ని సోకులన్ని
పాడుకో ప్రేమ కైతలల్లి కైతలల్లి
వేసుకో పాలబుగ్గ పైన రంగవల్లి

మేని సోయగాలు ప్రేమ బంధనాలు
మౌన స్వాగతాలు రాగ రంజితాలు
సరసములో సమరములు
సరసులకూ సహజములు
ప్రాభవాలలోన నవశోభనాల జాణ
రాగకే రాగమై రాధవై
కోరుకో సన్నజాజిమల్లి జాజిమల్లి
ఏలుకో కన్నె సోకులన్ని సోకులన్ని
పాడుకో ప్రేమ కైతలల్లి కైతలల్లి
వేసుకో పాలబుగ్గ పైన రంగవల్లి
రాగాలనే.. హొయ్ బోయిలతో.. హొయ్
మేఘాల మేనాలో రానా..
కోనలో సన్నజాజిమల్లి జాజిమల్లి
మేనులో పొన్నపూలవల్లి పాలవెల్లి
వేణిలో కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో అనురాగవల్లి రాగవల్లి

కోయిలమ్మ రాగం కొండవాగు వేగం
పారిజాత సారం ఏకమైన రూపం
అధరముపై అరుణిమలు
మధురిమకై మదనములు
నందనాలలోన రసమందిరాలలోన
హాయిగా సాగగా తియ్యగా

కోనలో సన్నజాజిమల్లి జాజిమల్లి
మేనులో పొన్నపూలవల్లి పాలవెల్లి
వేణిలో కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో అనురాగవల్లి రాగవల్లి
కావ్యాలకే హో.. శ్రీకారమై హో..
కస్తూరి తాంబూళమీవే
కోరుకో సన్నజాజిమల్లి జాజిమల్లి
ఏలుకో కన్నె సోకులన్ని సోకులన్ని
పాడుకో ప్రేమ కైతలల్లి కైతలల్లి
వేసుకో పాలబుగ్గ పైన రంగవల్లి
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory