
లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా (2)
పూల చెట్టు ఊగినట్టు
పాల బొట్టు చిందినట్టు
అల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్వు
తేనెపట్టు రేగినట్టు
వీణవెట్టు వొణికినట్టు
ఝల్లుమంది గుండెల్లో ఎవరే నువ్వు
నా మనసుని మైమరపున ముంచిన ఆ వాన
మీకెవరికి కనిపించదె ఏమైనా ఓ.. హో.. ఓ..
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
చుట్టుపక్కలెందరున్నా గుర్తుపట్టలేక ఉన్నా
అంతమంది ఒక్కలాగే కనపడుతుంటే
తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా
చెప్పలేను నిజమేదో నాకు వింతే
కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో
చెప్పవ కనురెప్పలకే మాటొస్తే ఓ.. హో.. ఓ..
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
0 comments:
Post a Comment