
బూరెలాంటి బుగ్గ చూడూ కారుమబ్బులాంటి కురులు చూడూ
వారెవ్వా క్యా హెయిర్ స్టైల్ యార్
ఓ.. వాలుకళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి
నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావే కావేరి
ఓ.. బూరె బుగ్గ బంగారి చేప కళ్ళ చిన్నారి
బుంగమూతి ప్యారి నంగనాచి నారి లవ్వు చెయ్యి ఒసారి
నిన్ను చూసినాక ఏమైందో పోరి వింతవింతగుంటోంది ఏమిటో ఈ స్టోరి
నువ్వు కనపడకుంటే తోచదే కుమారి నువ్వు వస్తే మనసంతా సరిగమపదరి
ఓ.. వాలుకళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి
నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావే కావేరి నన్ను ముంచినావే దేవేరి
నీ హృదయంలో నాకింత చోటిస్తే దేవతల్లే చూసుకుంటా నీకు ప్రాణమైన రాసి ఇస్తా
అలా కోపంగా నా వైపు నువ్వు చూస్తే దీవెనల్లే మార్చుకుంటా దాన్ని ప్రేమలాగ తీసుకుంటా
నాకోసం పుట్టినావని నా మనసే చెప్పినాదిలే
ఈ బంధం ఎప్పుడో ఇలా పైవాడు వేసినాడులే
ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే నీకు నేను ఇష్టమే అని
ఓ.. వాలుకళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి
నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావె కావేరి నన్ను ముంచినావే దేవేరి
ఈ ముద్దుగుమ్మే నా వైఫుగా వస్తే బంతిపూల దారివేస్తా లేత పాదమింక కందకుండా
ఈ జాబిలమ్మే నా లైఫులోకొస్తే దిష్టి తీసి హారతిస్తా ఏ పాడు కళ్ళు చూడకుండా
నాలాంటి మంచివాడిని మీరంతా చూసి ఉండరే
ఆ మాటే మీరు ఈమెతో ఓసారి చెప్పి చూడరే
ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే నువ్వు నాకు సొంతమేనని
ఓ.. వాలుకళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి
నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావె కావేరి నన్ను ముంచినావే దేవేరి
0 comments:
Post a Comment