Widgets


నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా song from Nachavule

 

నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా
నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా
ప్రతీజన్మలోనా నీతో ప్రేమలోన ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా
నచ్చావే నచ్చావే ఓ నచ్చావే నచ్చావులే

అనుకొని అనుకోగానే సరాసరి ఎదురవుతావు
వేరేపనేం లేదా నీకు నన్నే వదలవు
ఓ.. నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను
మరువలేనే నిన్ను నేను గుర్తురానే నాకు నేను
నీ మైకం కమ్ముకుంది ఈ రోజే నన్నిలా
ఈ లోకం కొత్తగుంది సీతాకోకలాగా
నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా

నీతో ఏదో చెప్పాలంటూ పదే పదే అనిపిస్తోంది
పెదాలలో మౌనం నన్నే ఆపేస్తున్నది
ఓ.. మనసునేమో దాచమన్నా అస్సలేమి దాచుకోదు
నిన్ను చూస్తే పొద్దు పోదు చూడకుంటే ఆశ పోదు
ఈ వైనం ఇంత కాలం నాలోనే లేదుగా
నువ్వు చేసే ఇంధ్రజాలం భరించేదెలాగా

నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా
నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా
ప్రతీజన్మలోనా నీతో ప్రేమలోన ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా
నచ్చావే నచ్చావులే ఓ నచ్చావే నచ్చావులే



0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory