Widgets


నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు అని అడిగేనా song from Nuvvostaanante Nenoddantaana

 

నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
నువు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా
ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా
నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా
నీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నా పేరేనా
అది నువ్వే అని నువ్వే చెబుతూఉన్నా
ల ల ల ల లాయిలే ల ల ల ల లాయిలే
ల ల లాయి లాయి ల లాయిలే లాయిలే లాయిలలే
నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా

హా.. ప్రతి అడుగు తనకుతానే సాగింది నీవైపు
నా మాట విననంటు నేనాపలేనంతగా
భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు
నీ కోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా
నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చరు హక్కు
నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు
ల ల ల ల లాయి లాయిలే ల ల ల ల లాయిలే
ల ల లాయి లాయి ల లాయిలే లాయిలే లాయిలలే
నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా

హా.. ఇది వరకు యద లయకు ఏ మాత్రము లేదు
హొరెత్తు ఈ జోరు కంగారు పెట్టేంతగా
తడబడకు నను అడుగు చెబుతాను పాఠాలు
లేలేత పాదాలు జలపాతమయ్యేట్టుగా
నా దారినే మళ్ళించగా నీకెందుకో అంత పంతం
మన చేతిలో ఉంటేకదా ప్రేమించటం మానటం
ల ల ల ల లాయి లాయిలే ల ల ల ల లాయి లాయిలే
ల ల లాయి లాయి ల లాయిలే లాయిలే లాయిలలే

హే.. నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
నువు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా
ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా
నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా
నా పేరుకి ఆ తియ్యదనం నీ పెదవే అందించేనా
అది నువ్వే అని నువ్వే చెబుతూఉన్నా
ల ల ల ల లాయి లాయిలే ల ల ల ల లాయి లాయిలే
ల ల లాయి లాయి ల లాయిలే లాయిలే లాయిలలే










0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory