Widgets


చెలివో నా చిలిపి కలవో song from Pellaina Kothalo

 

చెలివో నా చిలిపి కలవో
శిలవో సంకెలవో చిరుతపులివో
నిను చేరాలనే చిరు ఆశా.. మదిని అణిచేసా
తెలుసుకోవా నీవాడినని
తెలుపరావా నా దానివని.. కలకాలం

పతివో నా హృదయ జతివో
యతివో నా గతివో మందమతివో
నాలో రేగే ఈ తపనా ఒకసారి వినవా
మదనపడి మనసు చెడి
మిగిలాను నీకోసం ఇలా శిలలా

వయసిది వెళ్ళమన్నది మనసిది ఆపుతున్నది
ఎవరికి చెప్పలేనిది ఎట్టా బతికేది
యదలకు గదులు ఉన్నవి తలుపులు తెరుచుకున్నవి
కలలకు స్వాగతం అని ఎలా తెలిపేది

ఒకరికి ఒకరు ఎవరిమో తపనలు ఎందుకోసమో
తెలియని జంట జీవులం భలే సంసారం
మనసుకు మమత దూరమా పెదవికి పలుకు దూరమా
వదలని హృదయ భారమా ఒసేయ్ వెళ్ళిపోవే

చెలివో నా చిలిపి కలవో
యతివో నా గతివో మందమతివో
నిను చేరాలనే చిరు ఆశా మదిని అణిచేసా
మదనపడి మనసు చెడి
మిగిలాను నీకోసం ఇలా శిలలా


To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory