అందగాడా అందాగాడా మాపటేల సెందురుడా
కన్నె కలవ కాసుకుంది కన్ను వేయయ్యో
ముద్ద కూడ ముట్టనీదు నిదర కూడ పట్టానీదు
పొద్దుపోని తాపమేదో సంపుతుంటది
లోకులు పలు కాకులయ్యా
నిన్ను నన్ను సూస్తారయ్యా
లేనిపోనివన్ని జేర్చి లోకువగ అంటారయ్యా
చాటు మాటు సరసమాడ రమ్మంటుండా
అందగాడా అందాగాడా మాపటేల సెందురుడా
కన్నె కలవ కాసుకుంది కన్ను వేయయ్యో
బెదురన్నదే లేని నా మనసు
చెదిరెనే నీ వంక చూడగా
పొగరైన పోట్ల గిత్త నా వయసు
లొంగెనే నువ్వు చెయి వెయ్యగా
మగసిరితో గెలిసావు నా కన్నె ఈడు
మగడింకా నువ్వేనని కట్టాను జోడు
గుడిలేని దేవుడ్ని గుండెల్లొ దాచుకుంటి నేడు
మా అమ్మ తోడు…
అందగాడా అందాగాడా మాపటేల సెందురుడా
కన్నె కలవ కాసుకుంది కన్ను వేయయ్యో
లోకులు పలు కాకులయ్యా
నిన్ను నన్ను సూస్తారయ్యా
లేనిపోనివన్ని జేర్చి లోకువగ అంటారయ్యా
చాటు మాటు సరసమాడ రమ్మంటుండా
అందగాడా అందాగాడా మాపటేల సెందురుడా
కన్నె కలవ కాసుకుంది కన్ను వేయయ్యో
ముద్ద కూడ ముట్టనీదు నిదర కూడ పట్టానీదు
పొద్దుపోని తాపమేదో సంపుతుంటది







0 comments:
Post a Comment